Share News

పలువురు మున్సిపల్‌ కమిషనర్ల బదిలీ

ABN , Publish Date - Feb 07 , 2026 | 06:39 AM

రాష్ట్రవ్యాప్తంగా పలువురు మున్సిపల్‌ కమిషనర్లను బదిలీ చేస్తూ మున్సిపల్‌, పట్టణాభివృద్ధి శాఖ ఉత్తర్వులు జారీచేసింది. అనంతపురం కమిషనర్‌గా

పలువురు మున్సిపల్‌ కమిషనర్ల బదిలీ

అమరావతి, ఫిబ్రవరి 6(ఆంధ్రజ్యోతి): రాష్ట్రవ్యాప్తంగా పలువురు మున్సిపల్‌ కమిషనర్లను బదిలీ చేస్తూ మున్సిపల్‌, పట్టణాభివృద్ధి శాఖ ఉత్తర్వులు జారీచేసింది. అనంతపురం కమిషనర్‌గా ఎం.జస్వంత్‌రావును, అక్కడ పనిచేస్తున్న బి.బాలస్వామిని విజయనగరానికి, పల్నాడు యూడీఏలో కార్యదర్శిగా ఉన్న జి.సాంబశివరావును గుంటూరు మున్సిపల్‌ కార్పొరేషన్‌లో డిప్యూటీ కమిషనర్‌గాను, అక్కడ పనిచేస్తున్న టి.వెంకటకృష్ణయ్యను పల్నాడు యూడీఏకు సెక్రటరీగా నియమించారు. గుంతకల్‌ కమిషనర్‌గా ఉన్న సీఎంఏ నయీం అహ్మద్‌ను ఆదోనికి, అక్కడ ఉన్న కృష్ణను సీఆర్‌డీఏకు బదిలీ చేశారు. ఏలూరు యూడీఏ కార్యదర్శిగా వెయిటింగ్‌లో ఉన్న పి.సింహాచలంను నియమించారు. ఒంగోలు యూడీఏలో కార్యదర్శిగా ఉన్న ఆర్‌.చండి దేవసేనను తాడేపల్లిగూడెం మున్సిపాలిటీ అసిస్టెంట్‌ కమిషనర్‌గా బదిలీ చేశారు. విజయవాడలో శానిటరీ ఇన్స్పెక్టర్‌గా ఉన్న కె.శివరామ్‌ప్రసాద్‌ను వినుకొండ కమిషనర్‌గా, అక్కడ శానిటరీ ఇన్స్పెక్టర్‌గా పనిచేస్తున్న ఎం.సుభాష్‌ చంద్రబోస్‌ను సీడీఎంఏకు రిపోర్టు చేయాలని సూచించారు. కల్యాణదుర్గంలో శానిటరీ ఇన్స్పెక్టర్‌గా పనిచేస్తున్న ఎస్‌.నూర్‌ అలీఖాన్‌ను కమలాపురం నగరపంచాయతీ కమిషనర్‌గాను, అక్కడ పనిచేస్తున్న ప్రహ్లాద్‌ను సీడీఎంఏకు రిపోర్టు చేయాలని ఆదేశించారు.

Updated Date - Feb 07 , 2026 | 06:39 AM