వేట్లపాలెంలో ముంబై ఫోరెన్సిక్ నిపుణులు
ABN , Publish Date - Mar 07 , 2026 | 05:08 AM
ఇటీవల కాకినాడ జిల్లా వేట్లపాలెంలో బాణసంచా పేలుళ్ల ప్రమాదానికి కారణాలు గుర్తించేందుకు ప్రభు త్వం ఏర్పాటు చేసిన..
సామర్లకోట, మార్చి 6 (ఆంధ్రజ్యోతి): ఇటీవల కాకినాడ జిల్లా వేట్లపాలెంలో బాణసంచా పేలుళ్ల ప్రమాదానికి కారణాలు గుర్తించేందుకు ప్రభు త్వం ఏర్పాటు చేసిన ముంబై ఫోరెన్సిక్ నిపుణుల బృందం రంగంలోకి దిగింది. శుక్రవారం నేరుగా సంఘటనా స్థలానికి చేరుకున్న ఈ బృందం దర్యాప్తు ప్రారంభించింది. ఫోరెన్సిక్ నిపుణుడు నిఖిలేష్ ఉకుండో.. ఇతర సహాయకులతో కలిసి వేట్లపాలెంలో ప్రమాద స్థలిని క్షుణ్ణంగా పరిశీలించారు.