Share News

అద్దేపల్లి సోదరులకు బెయిల్‌

ABN , Publish Date - Feb 04 , 2026 | 05:51 AM

అన్నమయ్య జిల్లా ములకలచెరువు నకిలీ మద్యం తయారీ కేసులో ఆరుగురు నిందితులకు బెయిల్‌ మంజూరైంది. ఈ కేసులో ప్రధాన నిందితుడు అద్దేపల్లి జనార్దనరావు (ఏ1), సయ్యద్‌ హాజీ (ఏ3), మిధున్‌దాస్ (ఏ10), అంతా దాస్‌ (ఏ11), అద్దేపల్లి...

అద్దేపల్లి సోదరులకు బెయిల్‌

  • నకిలీ మద్యం కేసులో మరో నలుగురికి కూడా.. నేడు విడుదల

ములకలచెరువు, ఫిబ్రవరి 3(ఆంధ్రజ్యోతి): అన్నమయ్య జిల్లా ములకలచెరువు నకిలీ మద్యం తయారీ కేసులో ఆరుగురు నిందితులకు బెయిల్‌ మంజూరైంది. ఈ కేసులో ప్రధాన నిందితుడు అద్దేపల్లి జనార్దనరావు (ఏ1), సయ్యద్‌ హాజీ (ఏ3), మిధున్‌దాస్ (ఏ10), అంతా దాస్‌ (ఏ11), అద్దేపల్లి జగన్‌మోహన్‌రావు (ఏ26), సయ్యద్‌ హాజీ (ఏ29)లకు తంబళ్లపల్లె జూనియర్‌ సివిల్‌ కోర్టు మంగళవారం బెయిల్‌ మంజూరు చేసింది. కాగా ఎన్టీఆర్‌ జిల్లా ఇబ్రహీంపట్నం కేసులోనూ ప్రధాన నిందితుడైన అద్దేపల్లి జనార్దన రావు, అతని సోదరుడు జగన్‌మోహన్‌రావుకు గతనెల 20న విజయవాడ ఆరో అదనపు జ్యూడీషియల్‌ ఫస్ట్‌ క్లాస్‌ మేజిస్ట్రేట్‌ కోర్టు బెయిల్‌ మంజూరు చేసింది. అలాగే సయ్యద్‌ హాజీ, మిధున్‌దా్‌స, అంతాదాస్‌, సయ్యద్‌ అల్లాబక్షులకు కూడా ఈ నెల 2న విజయవాడ కోర్టు బెయిల్‌ ఇచ్చింది. ఈ ఆరుగురుకీ రెండు కేసుల్లోనూ బెయిలు రావడంతో బుధవారం మదనపల్లె సబ్‌జైలు నుంచి విడుదల కానున్నారు. కాగా, ములకలచెరువు నకిలీ మద్యం కేసులో అరెస్టయి మదనపల్లె సబ్‌జైలులో ఉన్న కోయంబత్తూరుకు చెందిన నిందితుడు సెంథిల్‌(ఏ30)ను పీటీ వారెంట్‌పై హాజరుపరిచేందుకు విజయవాడ కోర్టు అనుమతి ఇచ్చింది. ఇబ్రహీంపట్నం కేసులోనూ సెంధిల్‌ నిందితుడిగా ఉండటంతో ఈ నెల 12లోగా మదనపల్లె సబ్‌జైలు నుంచి తీసుకొచ్చి కోర్టులో హాజరుపరచాలని ఉత్తర్వులు ఇచ్చింది.

Updated Date - Feb 04 , 2026 | 05:55 AM