కులాన్ని టార్గెట్ చేస్తున్నారు!
ABN , Publish Date - Feb 03 , 2026 | 05:09 AM
గాడితప్పిన రాక్షస పాలనలో దహనకాండ చూస్తున్నామని వైసీపీ నేత ముద్రగడ పద్మనాభరెడ్డి విమర్శించారు.
రాష్ట్రంలో ఎమర్జెన్సీ పెట్టాలి.. సీఎం చంద్రబాబుకు ముద్రగడ లేఖ
కిర్లంపూడి, ఫిబ్రవరి 2(ఆంధ్రజ్యోతి): గాడితప్పిన రాక్షస పాలనలో దహనకాండ చూస్తున్నామని వైసీపీ నేత ముద్రగడ పద్మనాభరెడ్డి విమర్శించారు. ఈ మేరకు సోమవారం సీఎం చంద్రబాబు, మంత్రి లోకేశ్‌లకు రాసిన లేఖను కాకినాడ జిల్లా కిర్లంపూడిలో మీడియాకు విడుదల చేశారు. ‘ప్రధానిని అడిగి ఏపీలో ఎమర్జెన్సీ పెట్టాలి. దీని ద్వారా ప్రతిపక్షాన్ని మీ పదవీకాలం అయ్యేంత వరకు జైల్లో పెట్టడానికి ఉపయోగపడుతుందని నా అభిప్రాయం. మాజీ మంత్రులు రజనీ, అంబటి, జోగి రమేశ్‌లను ఘోరంగా అవమానించారు. ఎంతసేపూ కులాన్ని టార్గెట్ చేస్తున్నారు. గతంలో నా కుటుంబాన్ని, ఈరోజు అంబటి కుటుంబాన్ని అవమానాలకు గురిచేశారు. మీ మీద కోపం ఉన్నా డిప్యూటీ సీఎంపై ప్రేమతో మీకు మద్దతు ఇచ్చాం. అయినా ఈ కులం మీద ఎప్పుడూ మీరు రగలిపోతానే ఉన్నారు. దయచేసి ఈ కులాన్ని రాష్ట్రం నుంచి వేరే రాష్ట్రానికి కట్టుబట్టలతో పంపించే కార్యక్రమం చేయండి’ అని లేఖలో ముద్రగడ పేర్కొన్నారు.