Share News

జగన్‌ మూర్ఖత్వం వల్లే సీమ లిఫ్ట్‌ ఆగింది

ABN , Publish Date - Apr 12 , 2026 | 05:40 AM

వైఎస్‌ జగన్‌ మూర్ఖత్వం, అవగాహనా రాహిత్యం వల్లే రాయలసీమ లిఫ్ట్‌ ఇరిగేషన్‌ ప్రాజెక్టు ఆగిందని మడకశిర ఎమ్మెల్యే, టీటీడీ పాలక మండలి సభ్యుడు ఎంఎస్‌ రాజు అన్నారు.

జగన్‌ మూర్ఖత్వం వల్లే సీమ లిఫ్ట్‌ ఆగింది

  • డీపీఆర్‌, అనుమతులు లేవని నాడే ఆపేశారు: ఎంఎస్‌ రాజు

అనంతపురం క్రైం, ఏప్రిల్‌ 11(ఆంధ్రజ్యోతి): వైఎస్‌ జగన్‌ మూర్ఖత్వం, అవగాహనా రాహిత్యం వల్లే రాయలసీమ లిఫ్ట్‌ ఇరిగేషన్‌ ప్రాజెక్టు ఆగిందని మడకశిర ఎమ్మెల్యే, టీటీడీ పాలక మండలి సభ్యుడు ఎంఎస్‌ రాజు అన్నారు. అనంతపురం జిల్లా కేంద్రంలోని ఆర్‌అండ్‌బీ అతిథి గృహంలో శనివారం ఆయన మీడియా సమావేశం నిర్వహించారు. ‘రాయలసీమ లిఫ్ట్‌ ఇరిగేషన్‌ ప్రాజెక్టుకు పాలన అనుమతుల కింద రూ.3800 కోట్లు విడుదల చేస్తూ ప్రకటనలు చేశారు. దీంతో కేంద్ర జలశక్తి శాఖ, కృష్ణా రివర్‌ బోర్డు ఆ ప్రాజెక్టును ఆపాలని ఆదేశాలు ఇచ్చింది. డీటెయిల్డ్‌ ప్రాజెక్టు రిపోర్టు లేకుండా, అనుమతి లేకుండా ప్రచార ఆర్భాటంతో పనులు మొదలు పెట్టాలని చూసినందుకే ఆ ప్రాజెక్టు ఆగింది. 2014 నుంచి 2019 వరకూ రాయలసీమ ప్రాజెక్టులు, హంద్రీనీవాకు సీఎం చంద్రబాబు ప్రభుత్వం రూ.12,500 కోట్లు ఖర్చు చేసింది. 2026-27 బడ్జెట్‌లో రూ.30 వేల కోట్లను సీమ హార్టికల్చర్‌ హబ్‌కు కేటాయించింది. సీమ ప్రాజెక్టులు, హంద్రీనీవా పనులను 80 శాతం పూర్తి చేసిన ఘనత ఎన్టీఆర్‌, చంద్రబాబుకే దక్కుతుంది. రాజధాని అమరావతిపై తన స్టాండ్‌ ఏంటో జగన్‌ చెప్పాలి. గతంలో అమరావతికి ఆమోదం తెలిపారు. అధికారంలోకి వచ్చిన తర్వాత మూడు రాజధానుల పేరుతో మూడుముక్కలాట ఆడారు. తాజాగా ఇప్పుడు మావిగన్‌ అంటున్నారు. అధికారంలో ఉన్న ఐదేళ్లలో దీనిపై ఎందుకు మాట్లాడలేదు? పోతిరెడ్డిపాడు, హంద్రీనీవా టీడీపీ విజన్‌. కాదని చర్చకు వచ్చే దుమ్ము మీకు ఉందా? అమరావతి శాశ్వత రాజధానిగా, విశ్వనగరంగా ఆవిర్భవించబోతోంది. ఐదేళ్లలో ఒక్క పరిశ్రమను కూడా జగన్‌ సీమకు తీసుకురాలేదు. రూ.4 లక్షల కోట్ల ప్రాజెక్టులు సీమకు వస్తున్నాయి. ప్రాజెక్టులపై వైసీపీ నేతలు అబద్ధాలు చెబుతున్నారు. డ్రామాలు మానుకోవాలి. జగన్‌... మాజీ మంత్రి వైఎస్‌ వివేకానందరెడ్డిని చంపింది, ఐదేళ్లు మభ్యపెట్టింది మీరే’ రాజు స్పష్టం చేశారు.

Updated Date - Apr 12 , 2026 | 05:41 AM