జూలై 7న ఈదుమూడిలో ఎమ్మార్పీఎస్ ఆవిర్భావ దినోత్సవం
ABN , Publish Date - Jun 03 , 2026 | 04:29 AM
ఎమ్మార్పీఎస్ 32వ ఆవిర్భావ దినోత్సవాన్ని జూలై 7న ప్రకాశం జిల్లా ఈదుమూడి గ్రామంలో నిర్వహించనున్నట్టు వ్యవస్థాపక అధ్యక్షుడు ఉసురుపాటి బ్రహ్మయ్య...
గుంటూరు, జూన్ 2 (ఆంధ్రజ్యోతి): ఎమ్మార్పీఎస్ 32వ ఆవిర్భావ దినోత్సవాన్ని జూలై 7న ప్రకాశం జిల్లా ఈదుమూడి గ్రామంలో నిర్వహించనున్నట్టు వ్యవస్థాపక అధ్యక్షుడు ఉసురుపాటి బ్రహ్మయ్య మాదిగ తెలిపారు. మంగళవారం గుంటూరులో విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఈసందర్భంగా రాష్ట్ర కార్యవర్గాన్ని ప్రకటించారు. రాష్ట్ర అధ్యక్షుడిగా పానుగంటి షాలేం రాజు మాదిగ, రాష్ట్ర వర్కింగ్ కమిటీ అధ్యక్షుడిగా ఏటుకూరి విజయ్ కుమార్ మాదిగ, రాష్ట్ర మహిళా అధ్యక్షురాలిగా నల్లూరి చంద్రశీల మాదిగ, రాష్ట్ర అధికార ప్రతినిధులుగా కోట సుబ్బ, హనుమంత్, పెంకి సుధాకర్ ఎన్నికైనట్టు తెలిపారు.