తీవ్రవాదం అడవుల్లో కాదు...అవకాశాలు లేనిచోట పెరుగుతుంది
ABN , Publish Date - Mar 31 , 2026 | 05:55 AM
‘జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ నిరంతరం చెబుతున్నట్లుగా ప్రతి యువకుడికీ గౌరవం, నైపుణ్యం, దేశ భవిష్యత్తులో భాగస్వామ్యం ఉన్నప్పుడే నిజమైన మార్పు వస్తుంది’ అని ఆ పార్టీ...
లోక్‌సభలో ఎంపీ తంగెళ్ల ఉదయ్ శ్రీనివాస్
న్యూఢిల్లీ, మార్చి 30(ఆంధ్రజ్యోతి): ‘జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ నిరంతరం చెబుతున్నట్లుగా ప్రతి యువకుడికీ గౌరవం, నైపుణ్యం, దేశ భవిష్యత్తులో భాగస్వామ్యం ఉన్నప్పుడే నిజమైన మార్పు వస్తుంది’ అని ఆ పార్టీ ఎంపీ తంగెళ్ల ఉదయ్ శ్రీనివాస్ అన్నారు. సోమవారం లోక్‌సభలో నక్సలిజం నిర్మూలనపై జరిగిన చర్చలో జనసేన తరఫున ఆయన మాట్లాడారు. ‘తీవ్రవాదం అడవుల్లో పెరగదు. అవకాశాలు లేని చోట పెరుగుతుంది. 2004-2014 మధ్య కాలంలో 16,463 నక్సల్ హింసాత్మక సంఘటనలు జరిగాయి. మన భద్రతా దళాలకు చెందిన 1,851 మంది వీరమరణం పొందారు. 2014లో మోదీ ప్రధాని అయ్యే సమయానికి 126 జిల్లాలు నక్సల్స్ పట్టులో ఉన్నాయి. 2017లో కేంద్రం ప్రవేశపెట్టిన ‘సమాధాన్’ సిద్ధాంత ఫలితాలు మనకళ్లముందే కనిపిస్తున్నాయ’ని ఎంపీ అన్నారు.