నేను ఏ త ప్పూ చేయలేదు..
ABN , Publish Date - Mar 17 , 2026 | 05:07 AM
‘నేను ఎటువంటి తప్పూ చేయలేదు. నన్ను ఎంపీగా గెలిపించిన ఏలూరు ప్రజలకు, టీడీపీకి ఈ విష యం తెలియజేస్తున్నా’’ అని ఎంపీ పుట్టా మహేశ్ యాదవ్ వెల్లడించారు.
నిర్దోషిగా బయటకు వస్తా: ఎంపీ పుట్టా
ఏలూరు, మార్చి 16(ఆంధ్రజ్యోతి): ‘నేను ఎటువంటి తప్పూ చేయలేదు. నన్ను ఎంపీగా గెలిపించిన ఏలూరు ప్రజలకు, టీడీపీకి ఈ విష యం తెలియజేస్తున్నా’’ అని ఎంపీ పుట్టా మహేశ్ యాదవ్ వెల్లడించారు. హైదరాబాద్ డ్రగ్స్ వ్యవహా రంలో ఆయనపై కేసు నమోదైన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో తన నియోజకవర్గ ప్రజలను ఉద్దేశిం చి సోమవారం ప్రకటన విడుదల చేశారు. ‘‘ఆ రోజు డిన్నర్‌కు హాజరైన మాట వాస్తవమే. కానీ, నేను ఏ తప్పూ చేయలేదు. విచారణకు సహకరిస్తా. నిర్దోషిగా బయటకు వస్తా. పార్టీ ఆదేశాల మేరకు నడుచుకుం టా. పార్టీ ఇచ్చిన నోటీసుపై లిఖిత పూర్వక వివరణ ఇస్తా. ఆరోపణల నుంచి బయటపడి, ఏలూరు అభివృద్ధికి పనిచేస్తాను’’ అని ప్రకటనలో తెలిపారు.