Share News

రాష్ట్ర అధ్యక్షుడికి వివరణ లేఖ రాశా: ఎంపీ పుట్టా

ABN , Publish Date - Mar 18 , 2026 | 04:34 AM

‘హైదరాబాద్‌ డ్రగ్స్‌ వ్యవహారంలో నేను నిర్దోషిని. స్నేహితుడు డిన్నర్‌కి పిలిస్తే హాజరయ్యా. అంతే తప్ప నేను ఎటువంటి డ్రగ్‌ తీసుకోలేదు.

రాష్ట్ర అధ్యక్షుడికి వివరణ లేఖ రాశా: ఎంపీ పుట్టా

ఏలూరు టూటౌన్‌, మార్చి 17(ఆంధ్రజ్యోతి): ‘హైదరాబాద్‌ డ్రగ్స్‌ వ్యవహారంలో నేను నిర్దోషిని. స్నేహితుడు డిన్నర్‌కి పిలిస్తే హాజరయ్యా. అంతే తప్ప నేను ఎటువంటి డ్రగ్‌ తీసుకోలేదు. ఇదే విషయాన్ని వివరిస్తూ తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివా్‌సకు లేఖ రాశాను. నేను ఏ తప్పు చేయలేదు’ అంటూ ఏలూరు ఎంపీ పుట్టా మహేశ్‌కుమార్‌ యాదవ్‌ మంగళవారం ఓ ప్రకటన విడుదల చేశారు. మరోవైపు ‘మేము మీతోనే ఉన్నాం.. ఏలూరు మిమ్మల్ని నమ్ముతోంది’ అంటూ ఏలూరు నగరంలో పలుచోట్ల ప్లెక్సీలు ఏర్పాటయ్యాయి. వీటిపై ఆసక్తికర చర్చ నడుస్తోంది.

Updated Date - Mar 18 , 2026 | 04:37 AM