Share News

‘కడప-బెంగళూరు రైల్వేలైన్‌’ వేగవంతం చేయండి

ABN , Publish Date - Feb 13 , 2026 | 03:53 AM

రాయలసీమ ప్రాంత అభివృద్ధికి అత్యంత కీలకమైన కడప-బెంగళూరు రైల్వే లైన్‌ ప్రాజెక్టును పునఃసమీక్షించి, పనులను వేగవంతం చెయ్యాలని బీజేపీ ఎంపీ దగ్గుబాటి పురందేశ్వరి కేంద్రానికి విజ్ఞప్తి చేశారు.

‘కడప-బెంగళూరు రైల్వేలైన్‌’ వేగవంతం చేయండి

  • కేంద్ర మంత్రి అశ్వినీ వైష్ణవ్‌కు ఎంపీ పురందేశ్వరి విజ్ఞప్తి

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 12(ఆంధ్రజ్యోతి): రాయలసీమ ప్రాంత అభివృద్ధికి అత్యంత కీలకమైన కడప-బెంగళూరు రైల్వే లైన్‌ ప్రాజెక్టును పునఃసమీక్షించి, పనులను వేగవంతం చెయ్యాలని బీజేపీ ఎంపీ దగ్గుబాటి పురందేశ్వరి కేంద్రానికి విజ్ఞప్తి చేశారు. రాష్ట్ర మంత్రి మండిపల్లి రాంప్రసాద్‌ రెడ్డితో కలిసి ఆమె గురువారం రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్‌కు ఈ మేరకు వినతిపత్రాన్ని అందజేశారు. 2008లో మంజూరైన ఈ ప్రాజెక్టు సుమారు 266-268 కి.మీ చేపట్టాల్సి ఉండగా, ఇప్పటివరకు కడప-పెండ్లిమర్రి మధ్య 21 కిలోమీటర్లు మాత్రమే పనులు పూర్తయ్యాయని కేంద్రమంత్రి దృష్టికి తీసుకెళ్లారు. ఈ రైల్వే లైన్‌ ద్వారా కొప్పర్తి మెగా ఇండస్ర్టియల్‌ పార్కుకు మెరుగైన రవాణా సౌకర్యం లభిస్తుందని తెలిపారు. ఈ ప్రాజెక్టును వేగవంతం చేసేందుకు అవసరమైతే వ్యయ నిష్పత్తిని పునఃసమీక్షించాలని కోరారు.

Updated Date - Feb 13 , 2026 | 03:53 AM