ఓబులేశ్వరస్వామి ఆలయంలో ఎంపీ పూజలు
ABN , Publish Date - Aug 17 , 2026 | 11:41 PM
మండలంలోని తోగలగల్లు గ్రామంలో వెలిసిన ఓబులేశ్వరస్వామి ఆలయంలో కర్నూలు పార్లమెంట్ సభ్యుడు బస్తిపాటి నాగరాజు సోమవారం ప్రత్యేక పూజలు నిర్వహించారు.
ఆస్పరి, ఆగస్టు 17 (ఆంధ్రజ్యోతి): మండలంలోని తోగలగల్లు గ్రామంలో వెలిసిన ఓబులేశ్వరస్వామి ఆలయంలో కర్నూలు పార్లమెంట్ సభ్యుడు బస్తిపాటి నాగరాజు సోమవారం ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ ధ్వజస్తంభ ప్రతిష్టాపన, హోమాలు ప్రత్యేక పూజల్లో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆలయ అభివృద్ధికి తనవంతు సహకారం అందిస్తానని పేర్కొన్నారు. అనంతరం స్థానిక గ్రామ కూటమి నాయకులు సమస్యలను ఆయన దృష్టి తెచ్చారు. యాటకల్లు, దొడగొండ, తురువగల్లు రోడ్లు అధ్వాన స్థితికి చేరుకున్నాయని, మరమ్మతులకు చర్యలు తీసుకోవాలని ఎంపీకి విన్నవించారు. తోగలగలు గ్రామ సమస్యలను అధిష్టానం దృష్టికి తీసుకెళ్లి పరిష్కారానికి కృషి చేస్తానని ఎంపీ హామీ ఇచ్చారు. కార్యక్రమంలో మాజీ సర్పంచ్ ఆంజనేయులు, మధు, శివకుమార్, సతీ్‌షకుమార్, జగన్నాథ్, వీరభద్ర పాల్గొన్నారు.