కాపులపై దాడి చేసిన చరిత్ర వైసీపీదే: కలిశెట్టి
ABN , Publish Date - Feb 03 , 2026 | 05:38 AM
కాపుల మీద దాడులు జరుగుతున్నాయని వైసీపీ నేతలు చెప్పే మాటలు చూస్తూంటే దెయ్యాలు వేదాలు వల్లించినట్లుందని టీడీపీ ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు విమర్శించారు.
న్యూఢిల్లీ, ఫిబ్రవరి 2(ఆంధ్రజ్యోతి): కాపుల మీద దాడులు జరుగుతున్నాయని వైసీపీ నేతలు చెప్పే మాటలు చూస్తూంటే దెయ్యాలు వేదాలు వల్లించినట్లుందని టీడీపీ ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు విమర్శించారు. సోమవారం ఢిల్లీలో ఆయన మాట్లాడారు. ‘కాపులు, బీసీల మీద దాడిచేసిన ఘన చరిత్ర వైసీపీదే. ముద్రగడ పద్మనాభం తన గౌరవాన్ని మరింతగా దిగజార్చుకోవద్దని కోరుతున్నా. ముద్రగడ పద్మనాభం కాపు జాతి కోసం ఉన్నారా? జగన్ కోసం ఉన్నారా? ఆలోచించుకోవాలి.’ అని కలిశెట్టి అన్నారు.