Share News

ప్రధానితో పురందేశ్వరి దంపతుల భేటీ

ABN , Publish Date - Mar 26 , 2026 | 03:13 AM

ప్రధాని నరేంద్ర మోదీతో ఎంపీ దగ్గుబాటి పురందేశ్వరి దంపతులు భేటీ అయ్యారు. బుధవారం పార్లమెంటులోని ప్రధాని కార్యాలయంలో..

ప్రధానితో పురందేశ్వరి దంపతుల భేటీ

  • దగ్గుబాటి రచించిన పుస్తకం మోదీకి బహూకరణ

న్యూఢిల్లీ, మార్చి 25(ఆంధ్రజ్యోతి): ప్రధాని నరేంద్ర మోదీతో ఎంపీ దగ్గుబాటి పురందేశ్వరి దంపతులు భేటీ అయ్యారు. బుధవారం పార్లమెంటులోని ప్రధాని కార్యాలయంలో ఆయనను మర్యాదపూర్వకంగా కలిశారు. దగ్గుబాటి వెంకటేశ్వరరావు రచించిన ‘‘ది గ్లింప్సెస్‌ ఆఫ్‌ వరల్డ్‌ హిస్టరీ’’ పుస్తకాన్ని ప్రధానికి బహూకరించారు. ఆ వివరాలను పురందేశ్వరి ‘ఎక్స్‌’ వేదికగా వెల్లడించారు. అలాగే, రైతులతో కలిసి ఎంపీ పురందేశ్వరి రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్‌తో భేటీ అయ్యారు.

Updated Date - Mar 26 , 2026 | 03:13 AM