Share News

పర్యాటకాంధ్రప్రదేశ్‌ దిశగా పయనం

ABN , Publish Date - Sep 28 , 2026 | 06:36 AM

రాష్ట్రాన్ని పర్యాటకాంధ్రప్రదేశ్‌గా తీర్చిదిద్దడమే లక్ష్యంగా కృషి చేస్తున్నామని మంత్రి కందుల దుర్గేశ్‌ అన్నారు. పర్యాటక పరంగా ఆంధ్రప్రదేశ్‌లో అన్ని అంశాలూ ఉన్నాయని, ఏపీని చూస్తే దేశాన్ని చుట్టి వచ్చినట్లేనని పేర్కొన్నారు.

పర్యాటకాంధ్రప్రదేశ్‌ దిశగా పయనం
DURGESH

  • ప్రపంచ పర్యాటక దినోత్సవంలో మంత్రి దుర్గేశ్‌

రాజమహేంద్రవరం, సెప్టెంబరు 27(ఆంధ్రజ్యోతి): రాష్ట్రాన్ని పర్యాటకాంధ్రప్రదేశ్‌గా తీర్చిదిద్దడమే లక్ష్యంగా కృషి చేస్తున్నామని మంత్రి కందుల దుర్గేశ్‌ అన్నారు. పర్యాటక పరంగా ఆంధ్రప్రదేశ్‌లో అన్ని అంశాలూ ఉన్నాయని, ఏపీని చూస్తే దేశాన్ని చుట్టి వచ్చినట్లేనని పేర్కొన్నారు. ప్రపంచ పర్యాటక దినోత్సవం సందర్భంగా రాజమహేంద్రవరంలో రాష్ట్రస్థాయిలో నిర్వహిస్తున్న ‘గోదావరి పిలుస్తోంది’ కార్యక్రమాన్ని ఆదివారం ఆయన ప్రారంభించారు. మంత్రి మాట్లాడుతూ... పర్యాటక రంగం అభివృద్ధి చెందితే రాష్ట్రం ఆర్థికంగా అభివృద్ధి చెందడంతో పాటు యువతకు ఉద్యోగాలు ఎక్కువగా లభిస్తాయన్నారు. రానున్న గోదావరి పుష్కరాల నిర్వహణకు ఈ వేడుకలను ట్రయల్‌ రన్‌గా భావిస్తున్నామని చెప్పారు.

ఉద్యాన శాఖకు రెండు స్కోచ్‌ అవార్డులు

రాష్ట్ర ఉద్యాన శాఖకు రెండు స్కోచ్‌ అవార్డులు లభించాయి. ఈ శాఖ ద్వారా సూక్ష్మసేద్యంలో డిజిటల్‌ టెక్నాలజీని సమర్థంగా అమలు చేసినందుకు ఏపీ మైక్రోఇరిగేషన్‌ ప్రాజెక్టు (ఏపీఎంఐపీ)కి సిల్వర్‌ స్కోచ్‌ అవార్డు దక్కగా.. ఏపీని ‘కోకో క్యాపిటల్‌ ఆఫ్‌ ఇండియా’గా అభివృద్ధి చేసే లక్ష్యంతో రూపొందించిన సమగ్ర కోకో విలువ శ్రేణి అభివృద్ధి ప్రణాళికకు స్కోచ్‌ అవార్డుదక్కింది. ఢిల్లీలో శనివారం జరిగిన కార్యక్రమంలో ఈ అవార్డులను ఉద్యానశాఖ డైరెక్టర్‌ కే శ్రీనివాసులు తరుఫున ఏపీఎంఐపీ ఓఎస్డీ రమేశ్‌, ఏడీహెచ్‌ సుధ స్వీకరించారు.

Updated Date - Sep 28 , 2026 | 06:38 AM