అమ్మప్రేమకు ‘పరీక్ష’
ABN , Publish Date - Jan 24 , 2026 | 05:13 AM
ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం దూర విద్య కేంద్రం ఆధ్వర్యంలో ఈ నెల 20 నుంచి యూజీ, పీజీ పరీక్షలు కొనసాగుతున్నాయి.
ఏఎన్‌యూ, జనవరి 23(ఆంధ్రజ్యోతి): ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం దూర విద్య కేంద్రం ఆధ్వర్యంలో ఈ నెల 20 నుంచి యూజీ, పీజీ పరీక్షలు కొనసాగుతున్నాయి. రాజమహేంద్రవరం సమీపంలోని గోకవరం పరీక్ష కేంద్రంలో జరుగుతున్న డిగ్రీ పరీక్షలకు మంగాదేవి అనే విద్యార్థిని తన 3 నెలల చిన్నారితో హాజరయ్యారు. తల్లిగా బాధ్యతలు నిర్వర్తిస్తూనే.. విద్యాభ్యాసాన్ని కొనసాగించాలనే ఆమె పట్టుదల, నిబద్ధత సమాజానికి ఆదర్శంగా నిలుస్తోంది.