Share News

చెరువులో పడి న తల్లీ కూతుళ్లు

ABN , Publish Date - May 02 , 2026 | 10:53 PM

ఎమ్మిగనూరు మండల పరిధిలోని శనివారం గుడికల్లు చెరువులో తల్లీ కూతుళ్లు కాలుజారి పడిన సంఘటన శనివారం చోటు చేసుకుంది.

   చెరువులో పడి న తల్లీ కూతుళ్లు
చెరువుగట్టుపై రోదిస్తున్న బంధువులు

చిన్నారి గల్లంతు

ఎమ్మిగనూరు రూరల్‌, మే 02 (ఆంధ్రజ్యోతి): ఎమ్మిగనూరు మండల పరిధిలోని శనివారం గుడికల్లు చెరువులో తల్లీ కూతుళ్లు కాలుజారి పడిన సంఘటన శనివారం చోటు చేసుకుంది. బళ్లారికి చెందిన రజియాబేగం తన ఏడేళ్ల కుమార్తె ఆఫ్రినను తీసుకొని బంధువులతో కలిసి గ్రామంలో జరిగే అల్లిపీరస్వామి ఉరుసు మహోత్సవానికి వచ్చింది. గ్రామ సమీపంలో ఉన్న చెరువు దగ్గర కాళ్లు కడుగుకునేందుకు వెళ్లి ప్రమాదవశాతత్తు అందులో పడిపోయారు. స్థానికులు గమనించి తల్లి రజియాబేగంను బయటకు తీసుకవచ్చారు. చిన్నారి ఆఫ్రిన నీటిలో మునిగి పోయింది. రూరల్‌ పోలీసులు డీఎస్పీ భార్గవి ఆధ్వర్యంలో గాలింపు చర్యలు చేపట్టారు. అయినా చిన్నారి ఆచూకీ తెలియరాలేదు.

Updated Date - May 02 , 2026 | 10:53 PM