Share News

మోపిదేవి ఆలయంలో కూలిన అన్నప్రాశన మండపం సీలింగ్‌

ABN , Publish Date - Mar 09 , 2026 | 05:11 AM

మోపిదేవి సుబ్రహ్మణ్యేశ్వరస్వామి దేవస్థానంలో అన్నప్రాశన జరిపించే రేకుల షెడ్డుకు ఏర్పాటుచేసిన సీలింగ్‌ శనివారం అర్ధరాత్రి కూలిపోయింది.

మోపిదేవి ఆలయంలో కూలిన అన్నప్రాశన మండపం సీలింగ్‌

మోపిదేవి, మార్చి 8 (ఆంధ్రజ్యోతి): మోపిదేవి సుబ్రహ్మణ్యేశ్వరస్వామి దేవస్థానంలో అన్నప్రాశన జరిపించే రేకుల షెడ్డుకు ఏర్పాటుచేసిన సీలింగ్‌ శనివారం అర్ధరాత్రి కూలిపోయింది. తెల్లవారితే ఆదివారం కావటంతో, దాదాపు 100 మందికిపైగా భక్తులు అన్నప్రాశన మండపంలో నిద్రిస్తుండగా, ఒక్కసారిగా సీలింగ్‌ కూలింది. నిద్రమత్తులో ఉన్న భక్తులు సీలింగ్‌ కూలుతున్న శబ్దం విని భయంతో బయటకు పరుగులు తీశారు. బాపట్ల జిల్లాకు చెందిన ఓ భక్తురాలి తలకు, కాలికి స్వల్ప గాయాలయ్యాయి. అన్నదానం నిర్వహణకు షెడ్డును వినియోగించే నిమిత్తం 2004లో మొదటిసారిగా సీలింగ్‌ ఏర్పాటు చేశారు. రెండు నెలలకే సీలింగ్‌ కూలిపోగా, ఇది రెండోసారి. ఇకనైనా చిన్నారులకు అన్నప్రాశన నిర్వహించేందుకు ఏర్పాటుచేసిన షెడ్డు నాణ్యతా ప్రమాణాలు, రక్షణ పరిశీలించి తగు చర్యలు తీసుకోవాల్సిందిగా భక్తులు కోరుతున్నారు.

Updated Date - Mar 09 , 2026 | 05:11 AM