Share News

మోహన్‌బాబుకు హైకోర్టులో చుక్కెదురు

ABN , Publish Date - Feb 18 , 2026 | 05:29 AM

మోహన్‌బాబు యూనివర్సిటీ చాన్స్‌లర్‌, సినీనటుడు మోహన్‌బాబుకు హైకోర్టులో చుక్కెదురైంది. విద్యార్థి నాయకుల కిడ్నాప్‌ కేసులో అరెస్ట్‌ నుంచి రక్షణ కల్పించేందుకు...

మోహన్‌బాబుకు హైకోర్టులో చుక్కెదురు

  • కిడ్నాప్‌ కేసులో అరెస్ట్‌ నుంచి రక్షణకు నిరాకరణ

  • క్వాష్‌ పిటిషన్‌ పై విచారణ మార్చి 3కు వాయిదా

అమరావతి, ఫిబ్రవరి 17(ఆంధ్రజ్యోతి): మోహన్‌బాబు యూనివర్సిటీ చాన్స్‌లర్‌, సినీనటుడు మోహన్‌బాబుకు హైకోర్టులో చుక్కెదురైంది. విద్యార్థి నాయకుల కిడ్నాప్‌ కేసులో అరెస్ట్‌ నుంచి రక్షణ కల్పించేందుకు న్యాయస్థానం నిరాకరించింది. విద్యార్థి నాయకుల కిడ్నా్‌ప్‌నకు ముందు, తరువాత కూడా కేసులో ప్రధాన నిందితుడు వర్సిటీ పీఆర్‌వో సతీష్‌తో పిటిషనర్‌ ఫోన్‌లో మాట్లాడారని, మెసేజ్‌లు కూడా చేసుకున్నారని పోలీసులు చెబుతున్నారని గుర్తుచేసింది. ఫోన్‌ కాల్స్‌తో పాటు మెసేజ్‌లను విశ్లేషించి ఫోరెన్సిక్‌ ల్యాబోరేటరీ నివేదిక అందజేయాల్సి ఉందని పేర్కొంది. ఈ దశలో మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వలేమని స్పష్టం చేసింది. అరె్‌స్టతో పాటు ఎఫ్‌ఐఆర్‌ ఆధారంగా తదుపరి చర్యలు నిలుపుదల చేస్తూ మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వాలన్న మోహన్‌బాబు అభ్యర్థనను హైకోర్టు తోసిపుచ్చింది. అనుబంధ పిటిషన్‌ను కొట్టివేసింది. వ్యాజ్యంపై లోతైన విచారణ జరుపుతామని పేర్కొంటూ క్వాష్‌ పిటిషన్‌పై విచారణను మార్చి 3కి వాయిదా వేసింది. ఈ మేరకు హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ వెంకట జ్యోతిర్మయి మంగళవారం ఉత్తర్వులు ఇచ్చారు.

Updated Date - Feb 18 , 2026 | 05:30 AM