మోదీ నాయకత్వం దేశాభివృద్ధికి కీలకం: చంద్రబాబు
ABN , Publish Date - Mar 23 , 2026 | 04:40 AM
దేశ చరిత్రలో అత్యధిక కాలం ప్రభుత్వాధినేతగా కొనసాగుతున్న ప్రధాని మోదీకి సీఎం చంద్రబాబు అభినందనలు తెలిపారు.
ప్రజాసేవలో అచంచల నిబద్ధత: లోకేశ్
అమరావతి, మార్చి 22(ఆంధ్రజ్యోతి): దేశ చరిత్రలో అత్యధిక కాలం ప్రభుత్వాధినేతగా కొనసాగుతున్న ప్రధాని మోదీకి సీఎం చంద్రబాబు అభినందనలు తెలిపారు. 8,931 రోజులుగా దేశానికి సేవలందిస్తుండడం ఆయన నాయకత్వ పటిమకు నిదర్శనమన్నారు. మోదీ నాయకత్వం దేశాభివృద్ధికి కీలకమని, వికసిత్ భారత్ 2047 లక్ష్యం సాకారమవ్వడానికి ఆయన నాయకత్వం అవసరమని ‘ఎక్స్’లో పేర్కొన్నారు. మంత్రి లోకేశ్ స్పందిస్తూ.. దేశ చరిత్రలో ప్రధాని మోదీ కొత్త మైలురాయిని అధిగమించారని అన్నారు. ప్రజాసేవలో మోదీ అచంచల నిబద్ధతకు ఈ రికార్డు నిదర్శనమని, కోట్లాది మందికి ఆయన స్ఫూర్తిప్రదాతగా అభివర్ణించారు. ప్రజల విశ్వాసమే మోదీకి అసలైన శక్తి అని రెవెన్యూ మంత్రి అనగాని సత్యప్రసాద్ తెలిపారు.