కార్మికుల వ్యతిరేకి మోదీ
ABN , Publish Date - Feb 06 , 2026 | 11:35 PM
ఎన్నో పోరాటా ల తో సాధించుకున్న కార్మికుల హక్కులను కాలరాస్తూ కార్మికులకు మోదీ ప్రభుత్వం వ్యతిరేకంగా పని చేస్తుందని రైతు సంఘం రాష్ట్ర గౌరవాధ్యక్షులు రామచంద్రయ్య, సీఐటీయూ జిల్లా అధ్యక్షులు రాధాకృష్ణ అన్నారు.
- రైతు సంఘం రాష్ట్ర గౌరవాధ్యక్షుడు రామచంద్రయ్య
పత్తికొండ టౌన్, ఫిబ్రవరి 6 (ఆంధ్రజ్యోతి): ఎన్నో పోరాటా ల తో సాధించుకున్న కార్మికుల హక్కులను కాలరాస్తూ కార్మికులకు మోదీ ప్రభుత్వం వ్యతిరేకంగా పని చేస్తుందని రైతు సంఘం రాష్ట్ర గౌరవాధ్యక్షులు రామచంద్రయ్య, సీఐటీయూ జిల్లా అధ్యక్షులు రాధాకృష్ణ అన్నారు. శుక్రవారం స్థానిక కన్యకా పరమేశ్వరి కల్యాణ మండపంలో సీఐటీయూ, ఏఐటీయూసీ ఆధ్వర్యంలో రౌండ్ టే బుల్ సమావేశం నిర్వహించారు. కార్మికుల పట్ల కేంద్రం వ్యవహరి స్తున్న తీరుకు నిరసనగా ఈనెల 12న దేశవ్యాప్తంగా తలపెట్టిన సార్వత్రిక సమ్మెలో వేలాదిగా కార్మికులు పాల్గొని జయప్రదం చేయాలని కోరారు. సమావేశంలో ఏఐటీయూసీ, సీఐటీయూ నా యకులు కృష్ణ, రవిచంద్ర, మాజీ సర్పంచ్ సోమశేఖర్, సీపీఐ, సీపీఎం, ప్రజా సం ఘాల నాయకులు నభిరసూల్, రాజాసాహెబ్, గోపాల్, సురేంద్ర కుమార్, వెంకటేశ్వరరెడ్డి, రామాంజనేయులు పాల్గొన్నారు.