Share News

నేడు కోస్తాలో మోస్తరు వర్షాలు

ABN , Publish Date - Jul 28 , 2026 | 05:34 AM

బంగాళాఖాతంలో తీవ్ర వాయుగుండం ప్రభావంతో మంగళవారం కోస్తాంధ్రలో అక్కడక్కడా పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది.

నేడు కోస్తాలో మోస్తరు వర్షాలు

అమరావతి, విశాఖపట్నం, జూలై 27(ఆంధ్రజ్యోతి): బంగాళాఖాతంలో తీవ్ర వాయుగుండం ప్రభావంతో మంగళవారం కోస్తాంధ్రలో అక్కడక్కడా పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. సోమవారం కోస్తాలో అక్కడక్కడా వర్షాలు కురిశాయి. దక్షిణ కోస్తాలో వేడి వాతావరణం కొనసాగింది. కావలిలో 38.4 డిగ్రీల గరిష్ఠ ఉష్ణోగ్రత నమోదైంది. వాయుగుండం నేపథ్యంలో వాతావరణం అనుకూలంగా లేనందున బుధవారం వరకు మత్స్యకారులు సముద్రంలోకి వెళ్లొద్దని మత్స్యశాఖ మంత్రి అచ్చెన్నాయుడు కోరారు.

Updated Date - Jul 28 , 2026 | 05:35 AM