మోడల్ టీచర్లకూ రిటైర్‌మెంట్ వయసు పెంచాలి
ABN , Publish Date - Mar 23 , 2026 | 04:16 AM
గురుకుల విద్యాసంస్థలు, కార్పొరేషన్లలో పనిచేస్తున్న ఉద్యోగుల పదవీ విరమణ వయసును 62 ఏళ్లకు పెంచడంపై మోడల్ స్కూల్స్ ప్రోగ్రెసివ్ టీచర్ల సంఘం...
అమరావతి, మార్చి 22 (ఆంధ్రజ్యోతి): గురుకుల విద్యాసంస్థలు, కార్పొరేషన్లలో పనిచేస్తున్న ఉద్యోగుల పదవీ విరమణ వయసును 62 ఏళ్లకు పెంచడంపై మోడల్ స్కూల్స్ ప్రోగ్రెసివ్ టీచర్ల సంఘం గౌరవాధ్యక్షుడు వంటేరు శ్రీనివాసులురెడ్డి, అధ్యక్షుడు కోమటిరెడ్డి శివశంకర్‌రెడ్డి హర్షం వ్యక్తంచేశారు. సీఎం చంద్రబాబు, మంత్రులు లోకేశ్, పయ్యావుల కేశవ్‌లకు కృతజ్ఞతలు తెలిపారు. అలాగే మోడల్ స్కూల్స్‌లో పనిచేస్తున్న ఉపాధ్యాయుల రిటైర్‌మెంట్ వయసును కూడా 62 ఏళ్లకు పెంచాలని డిమాండ్ చేశారు.