విశాఖ ఉక్కు సీఎండీగా తెలుగు వ్యక్తి
ABN , Publish Date - Mar 15 , 2026 | 04:05 AM
విశాఖపట్నం స్టీల్ ప్లాంటు (రాష్ట్రీయ ఇస్పాత్ నిగమ్ లిమిటెడ్-ఆర్‌ఐఎన్‌ఎల్)కు చైర్మన్ కమ్ మేనేజింగ్ డైరెక్టర్‌గా ఎంఎన్‌వీఎస్ ప్రభాకర్‌ను సెర్చ్ కమ్ సెలక్షన్ కమిటీ శనివారం ఎంపిక చేసింది.
ఎంఎన్‌వీఎస్ ప్రభాకర్ ఎంపిక
స్టీల్ ఉత్పత్తి రంగంలో 35 ఏళ్లుగా సేవలు
విశాఖపట్నం, మార్చి 14 (ఆంధ్రజ్యోతి): విశాఖపట్నం స్టీల్ ప్లాంటు (రాష్ట్రీయ ఇస్పాత్ నిగమ్ లిమిటెడ్-ఆర్‌ఐఎన్‌ఎల్)కు చైర్మన్ కమ్ మేనేజింగ్ డైరెక్టర్‌గా ఎంఎన్‌వీఎస్ ప్రభాకర్‌ను సెర్చ్ కమ్ సెలక్షన్ కమిటీ శనివారం ఎంపిక చేసింది. ఆయన ప్రస్తుతం ఎన్‌ఎండీసీకి చెందిన నగర్‌నార్ స్టీల్ ప్లాంటు ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్‌గా పనిచేస్తున్నారు. దానికి ముందు ఆయన సెయిల్‌కు చెందిన రూర్కెలా స్టీల్ ప్లాంటులో సీజీఎంగా బాధ్యతలు నిర్వహించారు. తెలుగు వ్యక్తి అయిన ప్రభాకర్ తిరుపతి ఎస్‌వీ యూనివర్సిటీలో బీటెక్ (మెటలర్జీ) చదివారు. ఆ తరువాత ఎంబీఏ చేశారు. స్టీల్ ఉత్పత్తి రంగంలో 35 ఏళ్లుగా సేవలు అందిస్తున్నారు. నగర్‌నార్ స్టీల్‌ప్లాంటును 30 లక్షల టన్నుల పూర్తి ఉత్పత్తి సామర్థ్యంతో పనిచేయించడానికి, సంస్థను బ్రేక్ ఈవెన్‌కు తీసుకురావడానికి చాలా కృషిచేశారు. బ్లాస్ట్ ఫర్నే్‌సల నిర్వహణలో అ పారమైన అనుభవం ఉంది. విశాఖపట్నం స్టీల్ ప్లాంటుకు ఏడాదిన్నరగా పూర్తిస్థాయి సీఎండీ లేరు. ఇన్‌చార్జి అధికారులతోనే నిర్వహిస్తున్నారు. అత్యంత కీలకమైన సమయంలో ప్రభాకర్‌ను నియమించడం వల్ల ప్లాంటు మళ్లీ పూర్వ వైభవం సాధిస్తుందని ఉద్యోగ వర్గాలు భావిస్తున్నాయి.