రవీంద్రనాథ్‌రెడ్డి ఆస్తుల వ్యవహారంలోనే దస్తగిరి బలి
ABN , Publish Date - Apr 24 , 2026 | 05:10 AM
వైసీపీ నేతల వందల కోట్ల భూకుంభకోణంలో జరిగిన వ్యవహారాలతోపాటు, కమలాపురం మాజీ ఎమ్మెల్యే, జగన్ మేనమామ రవీంద్రనాథ్ రెడ్డి ...
ఎమ్మెల్సీ భూమిరెడ్డి రాంగోపాల్ రెడ్డి
అమరావతి, ఏప్రిల్ 23 (ఆంధ్రజ్యోతి): వైసీపీ నేతల వందల కోట్ల భూకుంభకోణంలో జరిగిన వ్యవహారాలతోపాటు, కమలాపురం మాజీ ఎమ్మెల్యే, జగన్ మేనమామ రవీంద్రనాథ్ రెడ్డి ఆస్తుల వ్యవహారమే దస్తగిరి హత్యకు కారణమని ఎమ్మెల్సీ భూమిరెడ్డి రాంగోపాల్ రెడ్డి ఆరోపించారు. టీడీపీ కేంద్ర కార్యాలయంలో గురువారం ఆయన విలేకరులతో మాట్లాడారు. వైఎస్ వివేకా హత్య కేసు తరహాలోనే పెద్ద దస్తగిరి హత్య జరిగిందని, దీని వెనుక వైసీపీ పెద్ద తలకాయలు ఉన్నాయని ఆరోపించారు. వైసీపీ కార్యకర్త పెద్ద దస్తగిరిని హత్య చేస్తే, పులివెందుల్లోనే ఉన్న జగన్ ఎందుకు పరామర్శకు పోలేదని, కనీసం ఎందుకు స్పందించడం లేదని ప్రశ్నించారు. రవీంద్రనాథ్ రెడ్డికి ఎలాంటి ఫ్యాక్టరీలు లేవు వ్యాపారాలు లేవని కానీ వేల కోట్ల ఆస్తులు ఉన్నాయని వీటిపై విచారణ జరపాలని డిమాండ్ చేశారు. పెద్ద దస్తగిరి హత్యను మాఫీ చేసే కుట్రలు జరుగుతున్నాయని అన్నారు.