జగన్ రాజకీయాలకు పనికిరాడు: ఎమ్మెల్సీ నాగబాబు
ABN , Publish Date - Jul 03 , 2026 | 05:15 AM
‘రాజకీయాల్లో స్థిరత్వం లేని వ్యక్తి జగన్మోహన్‌రెడ్డి. ఆయన రాజకీయాలకు పనికిరారు’ అని ఎమ్మెల్సీ నాగబాబు అన్నారు. పార్వతీపురం మండలం నర్సిపురంలో..
పార్వతీపురం, జూలై 2(ఆంధ్రజ్యోతి): ‘రాజకీయాల్లో స్థిరత్వం లేని వ్యక్తి జగన్మోహన్‌రెడ్డి. ఆయన రాజకీయాలకు పనికిరారు’ అని ఎమ్మెల్సీ నాగబాబు అన్నారు. పార్వతీపురం మండలం నర్సిపురంలో ఆయన గురువారం విలేకరులతో మాట్లాడారు. ‘ప్రపంచంలో రాజధాని మార్చాలని ఇద్దరే ఇద్దరు ప్రయత్నించారు. అందులో తుగ్లక్ ఢిల్లీని రాజధాని కాదని ఔరంగాబాద్ మార్చాడు. దానివల్ల కొన్ని వందల మంది చనిపోయారు. మళ్లీ ఔరంగాబాద్ నుంచి ఢిల్లీకి రాజధానిని మార్చినప్పుడు కొన్ని వేల మంది చనిపోయారు. తుగ్లక్ మాదిరే జగన్ వ్యవహారం ఉంది’ అని నాగబాబు అన్నారు.