స్తంభింపజేయడం సరికాదు: మర్రి రాజశేఖర్
ABN , Publish Date - Feb 19 , 2026 | 06:11 AM
తిరుమల లడ్డూ కల్తీ విషయంపై మండలిలో చర్చకు నిరాకరించడంపై ఎమ్మెల్సీ మర్రి రాజశేఖర్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు.
ఇంటర్నెట్ డెస్క్: తిరుమల లడ్డూ కల్తీ విషయంపై మండలిలో చర్చకు నిరాకరించడంపై ఎమ్మెల్సీ మర్రి రాజశేఖర్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. మీడియాలో, సోషల్ మీడియాలో విస్తృతంగా చర్చ జరుగుతున్నా, సీబీఐ చార్జ్‌షీట్ కూడా వేసిన అంశంపై చర్చించడానికి వాయిదా తీర్మానం ఇచ్చామని, చైర్మన్ దాన్ని తిరస్కరించారని చెప్పారు. అత్యంత ముఖ్యమైన అంశంపై చర్చకు నిరాకరించి, ప్రజలకు సంబంధంలేని హెరిటేజ్ అంశాన్ని పట్టుకుని వ్యక్తిగత ఎజెండాతో వైసీపీ సభ్యులు సభను స్తంభింపజేయడం సరికాదన్నారు. కల్తీ లడ్డూపై సభలో చర్చించేందుకు వైసీపీ ఎందుకు సిద్ధంగా లేదని ఎమ్మెల్సీ బి.కల్యాణ చక్రవర్తి నిలదీశారు. తాము రాజీనామా చేసి 14 నెలలైనా ఆమోదించలేదన్నారు.