రహస్యంగా అనంతబాబుకు వైద్య పరీక్షలు
ABN , Publish Date - Jun 21 , 2026 | 04:41 AM
వైసీపీ ఎమ్మెల్సీ అనంతబాబుకు కాకినాడ ప్రభుత్వ ఆసుపత్రిలో శనివారం వైద్య పరీక్షలు నిర్వహించారు.
విశాఖ కేజీహెచ్‌కు రిఫర్ చేసిన వైద్యులు..!
జీజీహెచ్(కాకినాడ), జూన్ 20(ఆంధ్రజ్యోతి): వైసీపీ ఎమ్మెల్సీ అనంతబాబుకు కాకినాడ ప్రభుత్వ ఆసుపత్రిలో శనివారం వైద్య పరీక్షలు నిర్వహించారు. డ్రైవర్ సుబ్రహ్మణ్యం హత్య కేసులో సాక్షులను బెదిరించిన కేసులో అరెస్టై రాజమహేంద్రవరం కేంద్ర కారాగారంలో ఉన్నారు. తనకు కొన్ని ఆరోగ్య సమస్యలు ఉన్నాయని, ప్రత్యేక సౌకర్యాలు కావాలని అనంతబాబు కోర్టులో పిటిషన్ వేశారు. దీంతో కోర్టు ఆయనకు వైద్య పరీక్షలు నిర్వహించాలని సూచించింది. జైలు అధికారులు నిందితుడు అనంతబాబును శనివారం కాకినాడ జీజీహెచ్‌కు తరలించి కొన్ని వైద్య పరీక్షలు నిర్వహించారు. ఈ వ్యవహారంలో వైద్యాధికారులు అత్యంత గోప్యత పాటించారు. ఎలాంటి సమాచారం బయటకు వెళ్లకుండా వ్యవహరించారు. కాగా అనంతబాబుకి జీజీహెచ్‌లో ఈసీజీ, అలా్ట్రసౌండ్ పరీక్షలు నిర్వహించాక, వైద్యులు ఆయనను విశాఖ కేజీహెచ్‌కు రిఫర్ చేశారని తెలిసింది.