Share News

పవన్‌ను కలిసిన ఎమ్మెల్యేలు

ABN , Publish Date - Mar 29 , 2026 | 05:43 AM

ఉపముఖ్యమంత్రి పవన్‌ కల్యాణ్‌ను శనివారం శాసనసభ విరామ సమయంలో పలువురు ఎమ్మెల్యేలు కలిశారు.

పవన్‌ను కలిసిన ఎమ్మెల్యేలు

  • నియోజకవర్గ సమస్యలపై వినతులు

అమరావతి, మార్చి 28(ఆంధ్రజ్యోతి): ఉపముఖ్యమంత్రి పవన్‌ కల్యాణ్‌ను శనివారం శాసనసభ విరామ సమయంలో పలువురు ఎమ్మెల్యేలు కలిశారు. తమ నియోజకవర్గాల పరిధిలో అపరిష్కృతంగా ఉన్న పలు సమస్యలను ఆయన దృష్టికి తీసుకువచ్చారు. పరిష్కారానికి సహకరించాలని కోరుతూ వినతిపత్రాలు సమర్పించారు. మంత్రులు వాసంశెట్టి సుభాష్‌, ఎమ్మెల్యేలు పులపర్తి రామాంజనేయులు, లోకం నాగమాధవి, సుందరపు విజయ్‌ కుమార్‌, గుమ్మనూరి జయరాం తదితరులు పవన్‌ను కలిసిన వారిలో ఉన్నారు.

Updated Date - Mar 29 , 2026 | 05:44 AM