అమర్నాథ్‌పై చర్యలు తీసుకోండి
ABN , Publish Date - Jun 18 , 2026 | 04:13 AM
రాష్ట్ర హోంమంత్రి అనితపై అనుచిత వ్యాఖ్యలు చేసిన మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్‌పై చర్యలు తీసుకోవాలంటూ..
అనంత ఎస్పీకి ఎమ్మెల్యేలు ఎంఎస్ రాజు, శ్రావణిశ్రీ ఫిర్యాదు
అనంతపురం క్రైం, జూన్ 17(ఆంధ్రజ్యోతి): రాష్ట్ర హోంమంత్రి అనితపై అనుచిత వ్యాఖ్యలు చేసిన మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్‌పై చర్యలు తీసుకోవాలంటూ మడకశిర, శింగనమల ఎమ్మెల్యేలు ఎంఎస్ రాజు, బండారు శ్రావణిశ్రీ అనంతపురం జిల్లా ఎస్పీ జగదీశ్‌ను కోరారు. అనంతపురంలోని క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యేలు బుధవారం ఎస్పీని కలిశారు. అనంతరం విలేకరులతో మాట్లాడుతూ రాజ్యాంగబద్ధమైన పదవిలో ఉన్న హోంమంత్రిపై అమర్నాథ్ అత్యంత అవమానకరంగా మాట్లాడారన్నారు. ఆ వ్యాఖ్యలు ఒక వ్యక్తిని మాత్రమే కాకుండా సమాజంలోని మహిళలందరి గౌరవాన్ని దెబ్బతీసేలా ఉన్నాయన్నారు.