Share News

ప్రభుత్వ కష్టానికి గవర్నర్‌ ప్రసంగంతో గౌరవం

ABN , Publish Date - Feb 13 , 2026 | 04:13 AM

ప్రభుత్వం పడిన కష్టానికి గవర్నర్‌ ప్రసంగం ద్వారా గౌరవం లభించిందని ఎమ్మెల్యే బెందాళం అశోక్‌ అన్నారు.

ప్రభుత్వ కష్టానికి గవర్నర్‌ ప్రసంగంతో గౌరవం

  • సీఎంకు ప్రజలు సహకరిస్తే మరిన్ని ఫలితాలు: ఎమ్మెల్యే అశోక్‌

అమరావతి, ఫిబ్రవరి 12(ఆంధ్రజ్యోతి): ప్రభుత్వం పడిన కష్టానికి గవర్నర్‌ ప్రసంగం ద్వారా గౌరవం లభించిందని ఎమ్మెల్యే బెందాళం అశోక్‌ అన్నారు. గురువారం అసెంబ్లీలో పలువురు ఎమ్మెల్యేలు గవర్నర్‌ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపారు. అశోక్‌ మాట్లాడుతూ, రూ.16వేల కోట్ల లోటు బడ్జెట్‌తో ప్రారంభమైన రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను సీఎం చంద్రబాబు గాడిలో పెట్టారని కొనియాడారు. చంద్రబాబు మహిళా పక్షపాతి అని, మహిళల ఆర్థిక ప్రణాళికలు, శక్తిసామర్థ్యాలపై ఆయనకు నమ్మకం ఉందని ఎమ్మెల్యే మాధవీ రెడ్డి కొనియాడారు. ఉచిత బస్సు పథకం ద్వారా రాష్ట్రవ్యాప్తంగా మహిళలు ప్రయోజనం పొందుతున్నారని ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి పేర్కొన్నారు.అసెంబ్లీ కౌరవ సభ నుంచి గౌరవ సభగా మారిందని ఎమ్మెల్యే రాధాకృష్ణ అన్నారు.

Updated Date - Feb 13 , 2026 | 04:13 AM