మరోసారి అలాంటి వ్యాఖ్యలు చేయను
ABN , Publish Date - May 23 , 2026 | 06:16 AM
జీడీనెల్లూరు ఎమ్మెల్యే థామస్ శుక్రవారం టీడీపీ కేంద్ర కార్యాలయానికి వచ్చారు.
టీడీపీ అధిష్ఠానం ఎదుట ఎమ్మెల్యే థామస్ వివరణ
అమరావతి, మే 22(ఆంధ్రజ్యోతి): జీడీనెల్లూరు ఎమ్మెల్యే థామస్ శుక్రవారం టీడీపీ కేంద్ర కార్యాలయానికి వచ్చారు. దళిత ఎమ్మెల్యేల నియోజకవర్గాల్లో మట్టి అక్రమ రవాణాతోసహా ఏ చిన్న ఘటన జరిగినా హైలెట్ చేస్తారని, అదే అగ్రవర్ణ ఎమ్మెల్యేల నియోజకవర్గాల్లో ఏం జరిగినా వాటిపై ఏం మాట్లాడరంటూ థామస్ చేసిన వ్యాఖ్యల వీడియో వైరల్ అయింది. ఈ వ్యాఖ్యలపై పార్టీ అధిష్ఠానం సీరియస్ అయింది. పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివా్‌సను కలిసిన థామస్... తాను చేసిన వ్యాఖ్యలపె వివరణ ఇచ్చారు. కావాలనే కొందరు తన మాటలను వక్రీకరించారని, ఇకపై ఎవ్వరు రెచ్చగొట్టినా అలాంటి వ్యాఖ్యలు చేయబోనని తెలిపారు.