వైసీపీ రాక్షస పాలనలో కష్టాల కడలిలో ప్రజలు
ABN , Publish Date - Jun 26 , 2026 | 06:41 AM
వైసీపీ ఐదేళ్ల రాక్షస పాలనలో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారని యలమంచిలి ఎమ్మెల్యే సుందరపు విజయ్‌కుమార్ అన్నారు.
జగన్‌కు రాజకీయ భవిష్యత్ లేదు: ఎమ్మెల్యే సుందరపు
విజయవాడ, జూన్ 25(ఆంధ్రజ్యోతి): వైసీపీ ఐదేళ్ల రాక్షస పాలనలో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారని యలమంచిలి ఎమ్మెల్యే సుందరపు విజయ్‌కుమార్ అన్నారు. విజయవాడలోని జనసేన పార్టీ కార్యాలయంలో గురువారం ఆయన మీడియాతో మాట్లాడారు. ‘రాష్ట్ర అభివృద్ధి కోసం కూటమి ప్రభుత్వం సమష్టిగా కృషి చేస్తోంది. అభివృద్ధి అంశాలపై మాట్లాడకుండా అవినీతి ఆరోపణలతో ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారు. కూటమి ఐక్యత కొనసాగినంతకాలం జగన్‌కు రాజకీయ భవిష్యత్తు లేదు. అందుకే కూటమి పార్టీల మధ్య విభేదాలు సృష్టించే ప్రయత్నాలు జరుగుతున్నాయి. ముద్రగడ కుటుంబానికి సంబంధించిన ట్వీట్‌పై వైసీపీ కార్యకర్తలు ట్రోలింగ్‌కు పాల్పడుతున్నారు’ అని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.