నోరు అదుపులో పెట్టుకోకుంటే చెప్పుతో సమాధానం : ఎమ్మెల్యే మురళీమోహన్
ABN , Publish Date - Feb 02 , 2026 | 05:18 AM
సీఎం చంద్రబాబుపై అవాకులు చవాకులు పేలిన వైసీపీ నాయకుడు అంబటి రాంబాబు నోరు అదుపులో పెట్టుకుని మాట్లాడాలి.
ఐరాల(కాణిపాకం), ఫిబ్రవరి 1(ఆంద్రజ్యోతి): ‘సీఎం చంద్రబాబుపై అవాకులు చవాకులు పేలిన వైసీపీ నాయకుడు అంబటి రాంబాబు నోరు అదుపులో పెట్టుకుని మాట్లాడాలి. లేదంటే చెప్పుతో సమాధానం చెబుతాం’ అని చెప్పు చూపి స్తూ చిత్తూరు జిల్లా పూతలపట్టు ఎమ్మెల్యే మురళీమోహన్ హెచ్చరించారు. కాణిపాకం ఆర్చి వద్ద ఆదివారం అంబటి దిష్టిబొమ్మను దహనం చేసిన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. ‘తిరుమల లడ్డూలో నెయ్యి కల్తీ విషయాన్ని ప్రజలు మరిచి పోవాలని ఇలాంటి మాటలను అంబటి మాట్లాడారు. ప్రజలు అన్ని విషయాలను గమనిస్తున్నారు. వైసీపీ వాళ్లు ఎన్ని ప్రయత్నాలు చేసిన లడ్డూ కల్తీ విషయాన్ని పక్కదోవ పట్టించలేరు’ అని మురళీ మోహన్ అన్నారు.