Share News

నోరు అదుపులో పెట్టుకోకపోతే జగన్‌ ఇంటినీ ముట్టడిస్తాం

ABN , Publish Date - Feb 02 , 2026 | 05:13 AM

సీఎం చంద్రబాబు, యువ నేత లోకేశ్‌ గురించి మాట్లాడేటపుడు నోరు అదుపులో పెట్టుకోవాలి. అవాకులు, చవాకులు పేలితే జగన్‌రెడ్డి ఇంటినీ ముట్టడిస్తాం.

నోరు అదుపులో పెట్టుకోకపోతే జగన్‌ ఇంటినీ ముట్టడిస్తాం

  • తప్పులను సమర్థించడమే నేటి దుస్థితికి కారణం: ఎమ్మెల్యే ఎంఎస్‌ రాజు

అనంతపురం, ఫిబ్రవరి 1(ఆంధ్రజ్యోతి): ‘సీఎం చంద్రబాబు, యువ నేత లోకేశ్‌ గురించి మాట్లాడేటపుడు నోరు అదుపులో పెట్టుకోవాలి. అవాకులు, చవాకులు పేలితే జగన్‌రెడ్డి ఇంటినీ ముట్టడిస్తాం. సీఎం చంద్రబాబు గురించి తప్పుడు మాటలు మాట్లాడిన అంబటి రాంబాబుకు టీడీపీ శ్రేణులు ఏ విధంగా బుద్ధి చెప్పాయో ఇప్పటికైనా గ్రహించాలి. తీరు మార్చుకోకపోతే జగన్‌రెడ్డికీ ఇదే గతి పడుతుంది’ అని టీడీపీ ఎస్సీ సెల్‌ రాష్ట్ర అధ్యక్షుడు, మడకశిర ఎమ్మెల్యే ఎంఎస్‌ రాజు హెచ్చరించారు. అనంతపురంలో ఆయన ఆదివారం మీడియాతో మాట్లాడారు. ‘ముఖ్యమంత్రి హోదాలో ఉన్న చంద్రబాబును, అంబటి రాంబాబు నీచంగా మాట్లాడితే సమర్థించడం ఏ మేరకు సమంజసమో జగన్‌రెడ్డి, వైసీపీ నాయకులు చెప్పాలి. తప్పు చేసింది అంబటి అయితే కాపు కులానికి ఏం సంబంధమో ఆ పార్టీ మాజీ మంత్రి అమర్‌నాథ్‌ చెప్పాలి. కులాల మధ్య చిచ్చుపెట్టాలని చూస్తున్నది ఎవరో ప్రజలు గమనిస్తున్నారు. తప్పుచేసిన అంబటిని వైసీపీ నుంచి ఎందుకు సస్పెండ్‌ చేయలేదు?’ అని ఎమ్మెల్యే రాజు ప్రశ్నించారు.

Updated Date - Feb 02 , 2026 | 05:13 AM