Share News

ఉనికిని చాటుకునేందుకే వైసీపీ చలో పోతిరెడ్డిపాడు: కాలువ శ్రీనివాసులు

ABN , Publish Date - Feb 07 , 2026 | 05:03 AM

రాయలసీమ ఎత్తిపోతల పథకంపై వైసీపీ నాయకులు చేస్తున్న విమర్శలు పచ్చి అబద్ధాలు. ప్రజలను తప్పుదోవ పట్టించేందుకే...

ఉనికిని చాటుకునేందుకే వైసీపీ చలో పోతిరెడ్డిపాడు: కాలువ శ్రీనివాసులు

అమరావతి, ఫిబ్రవరి 6(ఆంధ్రజ్యోతి): ‘‘రాయలసీమ ఎత్తిపోతల పథకంపై వైసీపీ నాయకులు చేస్తున్న విమర్శలు పచ్చి అబద్ధాలు. ప్రజలను తప్పుదోవ పట్టించేందుకే జగన్‌ రెడ్డి ‘చలో పోతిరెడ్డిపాడు’ అనే సరికొత్త రాజకీయ నాటకానికి తెరలేపారు’’ అని ఎమ్మెల్యే కాలువ శ్రీనివాసులు విమర్శించారు. టీడీపీ కేంద్ర కార్యాలయంలో శుక్రవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. ‘సీమలో ఉనికి కోల్పోయిన వైసీపీ, మళ్లీ తన ఉనికిని చాటుకోవడానికే ఇటువంటి పసలేని యాత్రలు చేస్తోంది. రాయలసీమ ఎత్తిపోతలను 2020లోనే ఎన్జీటీ నిలిపివేసింది. అప్పుడు అధికారంలో ఉన్న జగన్‌ ఏం చేస్తున్నారు? సీమకు నీళ్లు అందించిన ఘనత ఎన్టీఆర్‌, చంద్రబాబుకు మాత్రమే దక్కుతుంది’ అని కాలువ అన్నారు.

Updated Date - Feb 07 , 2026 | 05:04 AM