మద్యం స్కాంలో వేళ్లన్నీ జగన్‌వైపే: బుచ్చయ్య
ABN , Publish Date - Jun 14 , 2026 | 05:33 AM
మద్యం కుంభకోణంలో అన్ని వేళ్లు జగన్ వైపే చూపిస్తున్నాయని, లిక్కర్ కేసులో అంతిమ లబ్ధిదారుడు జగనే అని ఆధారాలు బయటపడుతున్నాయని..
రాజమహేంద్రవరం రూరల్, జూన్ 13(ఆంధ్రజ్యోతి): మద్యం కుంభకోణంలో అన్ని వేళ్లు జగన్ వైపే చూపిస్తున్నాయని, లిక్కర్ కేసులో అంతిమ లబ్ధిదారుడు జగనే అని ఆధారాలు బయటపడుతున్నాయని రాజమహేంద్రవరం రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్యచౌదరి ఆరోపించారు. శనివారం తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. కూటమి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసనలు చేయించే అర్హత జగన్‌కు లేదని, ఐదేళ్ల పాలనలో రాష్ట్రాన్ని నాశనం చేశాడన్నారు. నాడు జగన్ ప్రభుత్వం చేసిన తప్పులను సీఎం చంద్రబాబు సరిదిద్ది రాష్ట్రాన్ని సంక్షేమం దిశగా ముందుకు నడిపిస్తున్నారన్నారు. ప్రజాస్వామ్యంలో జగన్‌లాంటి వ్యక్తి ఉండేందుకు అర్హత లేదని గోరంట్ల అన్నారు.