నవరత్నాల పేరుతో ప్రజాధనం దోచేశారు
ABN , Publish Date - Mar 15 , 2026 | 04:55 AM
జగన్‌రెడ్డి చీకటి పాలన గురించి ఇప్పటికీ గుర్తు చేసుకోవాల్సి రావడం దురదృష్టకరమని ఎమ్మెల్యే గల్లా మాధవి అన్నారు.
ఎమ్మెల్యే గల్లా మాధవి
అమరావతి, మార్చి 14(ఆంధ్రజ్యోతి): జగన్‌రెడ్డి చీకటి పాలన గురించి ఇప్పటికీ గుర్తు చేసుకోవాల్సి రావడం దురదృష్టకరమని ఎమ్మెల్యే గల్లా మాధవి అన్నారు. టీడీపీ కేంద్ర కార్యాలయంలో శనివారం ఆమె విలేకరులతో మాట్లాడారు. ‘నిజాన్ని అబద్ధమని నమ్మించేందుకు జగన్ మీడియా ముందుకు వచ్చి గంటలు గంటలు సోది చెబుతున్నారు. పదే పదే తన ఐదేళ్ల చీకటి పాలనను ప్రజలకు గుర్తు చేసి మానసిక క్షోభ కలిగిస్తున్న్డారు. నవరత్నాల పేరుతో ప్రజాధనాన్ని లూటీ చేసిన జగన్ ఇప్పుడు నీతులు చెబుతున్నారు.