Share News

ఆత్మ విమర్శ చేసుకోలేని స్థితిలో జగన్‌: బుద్ధప్రసాద్‌

ABN , Publish Date - Jul 03 , 2026 | 05:20 AM

ప్రజల తీర్పును గౌరవించి, ఆత్మ విమర్శ చేసుకోలేని స్థితిలో జగన్‌ ఉన్నారని అవనిగడ్డ ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్‌ అన్నారు.

ఆత్మ విమర్శ చేసుకోలేని స్థితిలో జగన్‌: బుద్ధప్రసాద్‌

అవనిగడ్డ, జూలై 2(ఆంధ్రజ్యోతి): ప్రజల తీర్పును గౌరవించి, ఆత్మ విమర్శ చేసుకోలేని స్థితిలో జగన్‌ ఉన్నారని అవనిగడ్డ ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్‌ అన్నారు. గురువారం అవనిగడ్డలో విలేకరులతో మాట్లాడుతూ, జగన్‌ గతంలో అమరావతికి మద్దతుగా మాట్లాడి, గెలిచాక మూడు రాజధానుల పేరుతో కాలక్షేపం చేశారన్నారు. జగన్‌ చెప్పిన మాటలు విశ్వసించని ప్రజలు వారు చెప్పిన పాలనా రాజధాని విశాఖలో, న్యాయ రాజధాని కర్నూలులో, అమరావతిలో వైసీపీని చిత్తుగా ఓడించి తమ అభిప్రాయాన్ని సూటిగా చెప్పారన్నారు. అయినా జగన్‌లో మార్పు రాకపోగా, పిచ్చి ముదిరినట్లు కనిపిస్తోందని ఎద్దేవా చేశారు.

Updated Date - Jul 03 , 2026 | 05:21 AM