Share News

డెలివరీ బాయ్‌గా ఎమ్మెల్యే బోడె ప్రసాద్‌!

ABN , Publish Date - Jan 21 , 2026 | 03:57 AM

కృష్ణా జిల్లా పెనమలూరు ఎమ్యెల్యే బోడె ప్రసాద్‌ మంగళవారం ఓ సరికొత్త అవతారం ఎత్తి అందరినీ ఆశ్చర్యపరిచారు..

డెలివరీ బాయ్‌గా ఎమ్మెల్యే బోడె ప్రసాద్‌!

  • వారి కష్టాలు తెలుసుకొనేందుకు సరికొత్త అవతారం

పెనమలూరు, జనవరి 20 (ఆంధ్రజ్యోతి): కృష్ణా జిల్లా పెనమలూరు ఎమ్యెల్యే బోడె ప్రసాద్‌ మంగళవారం ఓ సరికొత్త అవతారం ఎత్తి అందరినీ ఆశ్చర్యపరిచారు. ఆన్‌లైన్‌ యాప్‌ల ద్వారా ఆహారం, నిత్యావసరాలు వంటి ఆర్డర్లను ఇంటింటికీ తిరుగుతూ అందించే డెలివరీ బాయ్‌ల కష్టాలు తెలుసుకొనేందుకు ఆయనే స్వయంగా డెలివరీ బాయ్‌గా మారిపోయారు. కాసేపు ఇంటింటికీ వెళ్లి.. ఆర్డర్లను డెలివరీ చేశారు. డెలివరీ బాయ్స్‌ ఎదుర్కొనే కష్టాలేంటి? వారి పని ఎంత కఠినంగా ఉంటుంది.. ఇవన్నీ తెలుసుకోవడానికి ఎమ్యెల్యే బోడె ప్రసాద్‌ ఇన్‌స్టామార్ట్‌ డెలివరీ బాయ్‌గా చేశారు. ఆ వేషంలో ఆర్డర్లను డెలివరీ చేసి.. వారి సమస్యలను ప్రత్యక్షంగా అనుభవించారు. ప్రతి రోజూ ఎండనకా, వాననకా, ట్రాఫిక్‌ సమస్యలను సైతం లెక్క చేయకుండా డెలివరీ బాయ్స్‌ రోజువారీ జీవితంలో పడుతున్న ఇబ్బందులను స్వయంగా చూడడానికే తాను ఈ వేషం వేసినట్లు ఎమ్మెల్యే తెలిపారు.

Updated Date - Jan 21 , 2026 | 04:42 AM