Share News

యువత బాగుపడటం జగన్‌కిష్టం లేదు : భూమిరెడ్డి

ABN , Publish Date - Jun 20 , 2026 | 05:49 AM

‘రాష్ట్రంలో యువత బాగుపడటం జగన్‌కు ఇష్టం లేదు. అందుకే నిరుద్యోగ యువతలో గందరగోళం సృష్టించడమే లక్ష్యంగా గత మూడు వారాలుగా ఆయన ముఠా నానా యాగీ చేస్తూ..

యువత బాగుపడటం జగన్‌కిష్టం లేదు : భూమిరెడ్డి

అమరావతి, జూన్‌ 19(ఆంధ్రజ్యోతి): ‘రాష్ట్రంలో యువత బాగుపడటం జగన్‌కు ఇష్టం లేదు. అందుకే నిరుద్యోగ యువతలో గందరగోళం సృష్టించడమే లక్ష్యంగా గత మూడు వారాలుగా ఆయన ముఠా నానా యాగీ చేస్తూ డీఎస్సీపై దుష్ప్రచారం చేస్తోంది’ అని ఎమ్మెల్సీ భూమిరెడ్డి రాంగోపాల్‌ రెడ్డి విమర్శించారు. వైసీపీ నేతలు డ్రామాలు కట్టిపెట్టి, డీఎస్సీపై మంత్రి లోకేశ్‌ సవాల్‌ను స్వీకరించి, చర్చకు రావాలని సవాల్‌ విసిరారు. గతంలో విద్యాశాఖ మంత్రిగా ఉన్నప్పుడు బొత్స సత్యనారాయణ టీచర్ల బదిలీల పేరిట రూ.50 కోట్లు వసూలు చేసి, 2000 మంది ఉపాధ్యాయుల బదిలీలకు అక్రమంగా తెరతీశారని, ఎన్నికల కోడ్‌ రావడంతో అవి నిలిచిపోయాయన్నారు.

Updated Date - Jun 20 , 2026 | 05:50 AM