గూడ్స్ రైలులో మంటలు
ABN , Publish Date - Mar 15 , 2026 | 04:27 AM
విజయనగరం జిల్లా బొండపల్లి మండలం గిట్టుపల్లి రైల్వే గేటు సమీపంలో శనివారం మధ్యాహ్నం విశాఖపట్నం నుంచి బిలాస్పూర్ వెళుతున్న గూడ్స్ రైలులో
బొండపల్లి, మార్చి 14 (ఆంధ్రజ్యోతి): విజయనగరం జిల్లా బొండపల్లి మండలం గిట్టుపల్లి రైల్వే గేటు సమీపంలో శనివారం మధ్యాహ్నం విశాఖపట్నం నుంచి బిలాస్పూర్ వెళుతున్న గూడ్స్ రైలులో ఓ బోగి వద్ద స్వల్ప మంటలు చెలరేగాయి. బోగికి సంబంధించిన బ్రేకులు పట్టేయడంతో ఈ ఘటన చోటు చేసుకుంది. గ్యాంగ్‌మెన్‌లు పైడి సీతారాం, బి.సూర్యనారాయణ ఎర్ర జెండా ఊపి రైలును ఆపడంతో ప్రమాదం తప్పింది. సుమారు 50 నిమిషాలు గూడ్స్ ఆగిపోవడంతో ఆ మార్గంలో రైళ్ల రాకపోకలకు అంతరాయం కలిగింది.