Sankranti Celebrations: సంబరాల్లో మంత్రులు
ABN , Publish Date - Jan 15 , 2026 | 04:18 AM
శ్రీసత్యసాయి జిల్లాలో బుధవారం సంక్రాంతి సంబరాల్లో మంత్రులు సత్యకుమార్ యాదవ్, సవిత పాల్గొన్నారు.
పెనుకొండ టౌన్, ధర్మవరం, జనవరి 14(ఆంధ్రజ్యోతి): శ్రీసత్యసాయి జిల్లాలో బుధవారం సంక్రాంతి సంబరాల్లో మంత్రులు సత్యకుమార్ యాదవ్, సవిత పాల్గొన్నారు. పెనుకొండ ప్రభుత్వ జూనియర్ కళాశాల మైదానంలో సవిత ఆధ్వర్యంలో ముగ్గుల పోటీలు నిర్వహించారు. ఉత్సవాల్లో పాల్గొనేందుకు ఆమె తన స్వగృహం నుంచి ఎద్దుల బండిపై వెళ్లారు. సరదగా గాలిపటాలు ఎగురవేయించారు. ధర్మవరం ప్రభుత్వ బాలుర ఉన్నతపాఠశాల క్రీడామైదానంలో నిర్వహించిన సంక్రాంతి సంబరాల్లో మంత్రి సత్యకుమార్ యాదవ్ సతీసమేతంగా పాల్గొన్నారు. కాలేజీ సర్కిల్ నుంచి వారు ఎద్దుల బండిపై వచ్చారు. అనంతరం భోగిమంటలు వెలిగించారు.
