Share News

తిరుమల పవిత్రతపై వైసీపీ దాడి: వాసంశెట్టి

ABN , Publish Date - Jan 11 , 2026 | 04:10 AM

తిరుమలను లక్ష్యంగా చేసుకుని వైసీపీ ముష్కర మూక కూటమి ప్రభుత్వంపై విష ప్రచారం చేస్తూ భక్తుల మనోభావాలతో...

తిరుమల పవిత్రతపై వైసీపీ దాడి: వాసంశెట్టి

అమరావతి, జనవరి 10(ఆంధ్రజ్యోతి): తిరుమలను లక్ష్యంగా చేసుకుని వైసీపీ ముష్కర మూక కూటమి ప్రభుత్వంపై విష ప్రచారం చేస్తూ భక్తుల మనోభావాలతో చెలగాటమాడుతున్నారని మంత్రి వాసంశెట్టి సుభాశ్‌ ఆరోపించారు. టీడీపీ కేంద్ర కార్యాలయంలో శనివారం ఆయన విలేకరులతో మాట్లాడారు. వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు తిరుమలను వ్యాపార కేంద్రంగా మార్చేశారని విమర్శించారు. తిరుమలలో మద్యం బాటిళ్లు పెట్టి భక్తుల మనోభావాలను దెబ్బతీసేందుకు వైసీపీ మీడియా వ్యక్తులు, వారి నాయకులు కుట్రలకు తెరదీశారు.

Updated Date - Jan 11 , 2026 | 04:10 AM