Share News

జగన్‌ వ్యాఖ్యలు అర్థరహితం: మంత్రి టీజీ భరత్‌

ABN , Publish Date - Jul 03 , 2026 | 05:07 AM

‘అమరావతి వర్సెస్‌ మావిగన్‌’ నినాదంతో 2029 ఎన్నికల్లో పోరాడతానంటూ జగన్‌ చేసిన వ్యాఖ్యలు అర్థరహితమని మంత్రి టీజీ భరత్‌ కొట్టి పారేశారు.

జగన్‌ వ్యాఖ్యలు అర్థరహితం: మంత్రి టీజీ భరత్‌

అమరావతి, జూలై 2(ఆంధ్రజ్యోతి): ‘అమరావతి వర్సెస్‌ మావిగన్‌’ నినాదంతో 2029 ఎన్నికల్లో పోరాడతానంటూ జగన్‌ చేసిన వ్యాఖ్యలు అర్థరహితమని మంత్రి టీజీ భరత్‌ కొట్టి పారేశారు. రాజధానిపై ఆయన తాజా వ్యాఖ్యలతో ప్రజాస్వామ్య వ్యవస్థలు, రాజ్యాంగపరమైన ప్రక్రియల పట్ల జగన్‌కు గౌరవం లేదని మరోసారి స్పష్టమైందని గురువారం ఓ ప్రకటనలో తెలిపారు. ‘రాష్ట్ర విభజన అంశం ముగిసినట్లే.. రాజధాని అమరావతి అంశం కూడా పార్లమెంటులో చట్టం చేయడంతో ముగిసింది. ప్రభుత్వాలు రావచ్చు.. పోవచ్చు కానీ అసెంబ్లీ, పార్లమెంటు తీసుకున్న నిర్ణయాలను గౌరవించాల్సిందే’ అని స్పష్టం చేశారు.

Updated Date - Jul 03 , 2026 | 05:08 AM