Share News

ఉత్తమ టెన్త్‌ విద్యార్థులకు మంత్రి టీజీ భరత్‌ విందు

ABN , Publish Date - May 18 , 2026 | 05:02 AM

పదో తరగతిలో ఉత్తమ మార్కులు సాధించిన ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులను మంత్రి టీజీ భరత్‌ ఆదివారం తన ఇంటికి ఆహ్వానించి..

ఉత్తమ టెన్త్‌ విద్యార్థులకు మంత్రి టీజీ భరత్‌ విందు

కర్నూలు అర్బన్‌, మే 17(ఆంధ్రజ్యోతి): పదో తరగతిలో ఉత్తమ మార్కులు సాధించిన ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులను మంత్రి టీజీ భరత్‌ ఆదివారం తన ఇంటికి ఆహ్వానించి, వారితో కలిసి భోజనం చేశారు. విద్యార్థులను అభినందించి, ప్రోత్సాహక నగదు బహుమతులు అందించారు. మంత్రి నారా లోకేశ్‌ విద్యారంగంలో ఎన్నోమార్పులు తీసుకొచ్చారని కొనియాడారు. ఈ లంచ్‌ మీట్‌కు పిక్కిలి లిఖిత (593), పింజరి గిరీశ్‌ (591), మీసాల మేఘన (587), కురువ మల్లికార్జున (581), గాజుల రోహిత(582) హాజరయ్యారు.

Updated Date - May 18 , 2026 | 06:03 AM