ఆరోగ్యంపై శ్రద్ధ వహించాలి: మంత్రి
ABN , Publish Date - Jan 18 , 2026 | 11:24 PM
ప్రతి ఒక్కరూ ఆరోగ్యంపై శ్రద్ధ వహించాలని రాష్ట్ర న్యాయ శాఖ మంత్రి ఎనఎండీ ఫరూక్ సూచించారు.
నంద్యాల రూరల్, జనవరి 18 (ఆంధ్రజ్యోతి) : ప్రతి ఒక్కరూ ఆరోగ్యంపై శ్రద్ధ వహించాలని రాష్ట్ర న్యాయ శాఖ మంత్రి ఎనఎండీ ఫరూక్ సూచించారు. ఆదివారం టీడీపీ కార్యాలయంలో 39 మంది బాధిత కుటుంబ సభ్యులకు రూ. 23 లక్షల సీఎం రిలీప్ ఫండ్ చెక్కులు అందజేశారు. మంత్రి మాట్లాడుతూ ఆరోగ్య విషయాలలో స్థోమతకు మించి ఖర్చు చేయాల్సి వచ్చినప్పుడు తమ కార్యాలయా న్ని సంప్రదించాలన్నారు. పేదలను ఆపదలో ఆదుకోవాలన్నదే ముఖ్య మంత్రి ధ్యేయమన్నారు. కార్యక్రమంలో టీడీపీ జిల్లా ప్రధాన కార్య దర్శి ఎనఎండీ పిరోజ్, రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు రామచంద్రరావు, రాష్ట్ర మార్క్‌పెడ్ డైరెక్టర్ తులసీరెడ్డి, మార్కెట్ యార్డుచైర్మన గుం టుపల్లి హరిబాబు, దూదేకుల కార్పొరేషన డైరెక్టర్ దస్తగిరి తదితరులు పాల్గొన్నారు.
గోస్పాడు : పేద లకు సీఎం సహాయనిధి ఒక వరం లాంటిదని టీడీపీ యువ నాయకుడు ఎనఎండి ఫయాజ్ అన్నారు. ఆదివారం పసుపలపాడు గ్రామానికి చెందిన మంజులకు మంజూరు అయిన సీఎంఆర్‌ఎఫ్ చెక్కును అందజేశారు. నాయకులు కాటంరెడ్డి తులసీశ్వర్ రెడ్డి, జూపల్లె భూపాల్ రెడ్డి, రమేష్ పాల్గొన్నారు.
నందికొట్కూరు: పట్టణంలోని సాయిబాబా పేట, సంగయ్య పేట, రామాలయం వీధి, హౌసింగ్ బోర్డు కాలనీ, ఎబీఎం పాలెం, సుబ్బా రావు పేట, బ్రహ్మంగారి మఠం తదితర ప్రాంతాల బాధితులకు ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి మంజూరు అయిన చెక్కులను ఎమ్మెల్యే జయసూర్య అందజేశారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ అనారోగ్యంతో బాధపడుతూ రూ.లక్షల వెచ్చించి వైద్యం చేయించుకోలేని వారికి సీఎం సహాయనిధి ఒక వరం లాంటిదన్నారు.