Share News

జగన్‌ రాష్ట్రానికి పట్టిన క్యాన్సర్‌: మంత్రి సుభాశ్‌

ABN , Publish Date - May 29 , 2026 | 05:00 AM

వైసీపీ అధినేత జగన్‌ రాష్ట్రానికి పట్టిన క్యాన్సర్‌ లాంటివాడని మంత్రి వాసంశెట్టి సుభాశ్‌ విమర్శించారు. కాకినాడ జిల్లా కాజులూరు మండలం కోలంకలో గురువారం ...

జగన్‌ రాష్ట్రానికి పట్టిన క్యాన్సర్‌: మంత్రి సుభాశ్‌

కరప, మే 28(ఆంధ్రజ్యోతి): వైసీపీ అధినేత జగన్‌ రాష్ట్రానికి పట్టిన క్యాన్సర్‌ లాంటివాడని మంత్రి వాసంశెట్టి సుభాశ్‌ విమర్శించారు. కాకినాడ జిల్లా కాజులూరు మండలం కోలంకలో గురువారం జరిగిన మహానాడు కార్యక్రమంలో అమలాపురం ఎంపీ హరీశ్‌ మాధుర్‌తో కలసి ఆయన మాట్లాడారు. కల్తీకి బ్రాండ్‌ అంబాసిడర్‌ జగన్‌ అని, జె బ్రాండ్‌ పేరుతో నకిలీ మద్యం, గంజాయి, అక్రమ మైనింగ్‌లను పెంచి పోషించిన ఘనత ఆయనకు దక్కుతుందన్నారు. మహిళా సాధికారత లక్ష్యంగా కూటమి ప్రభుత్వం పాలన సాగిస్తుంటే కన్న తల్లి, చెల్లిని బయటకు గెంటేసిన ఘనుడు జగన్‌ అన్నారు. టీడీపీకి, వైసీపీకి నక్కకు నాకలోకానికి ఉన్నంత తేడా ఉందన్నారు. ఎన్నికల్లో కూటమి ప్రభుత్వం 164 సీట్లతో చరిత్ర తిరగరాస్తే 151 నుంచి 11సీట్లకు పడిపోయి జగన్‌ రికార్డు సృష్టించారని ఎద్దేవా చేశారు. రానున్న ఎన్నికల్లో వైసీపీ ఒకే ఒక్క సీటుకు పరిమితమవుతుందని ఆయన జోస్యం చెప్పారు. చట్టసభల్లో మహిళలకు 33 శాతం సీట్లు కేటాయిస్తూ ముఖ్యమంత్రి చంద్రబాబు తీర్మానం చేయడం చరిత్రాత్మక నిర్ణయమని ఎంపీ కొనియాడారు.

Updated Date - May 29 , 2026 | 05:00 AM