దాడులు, దౌర్జన్యాలపై ఉక్కుపాదం: మంత్రి సవిత
ABN , Publish Date - Jan 19 , 2026 | 03:56 AM
దాడులు, దౌర్జన్యాలకు పాల్పడితే ఉక్కుపాదంతో అణచివేస్తామని బీసీ సంక్షేమ, చేనేత జౌళిశాఖ మంత్రి సవిత హెచ్చరించారు.
పెనుకొండ టౌన్, జనవరి 18(ఆంధ్రజ్యోతి): దాడులు, దౌర్జన్యాలకు పాల్పడితే ఉక్కుపాదంతో అణచివేస్తామని బీసీ సంక్షేమ, చేనేత జౌళిశాఖ మంత్రి సవిత హెచ్చరించారు. శ్రీసత్యసాయి జిల్లా పెనుకొండ పట్టణంలోని టీడీపీ కార్యాలయంలో మంత్రి సవిత ఆదివారం మీడియాతో మాట్లాడారు. జగన్ పోద్బలంతో వైసీపీ గూండాలు రెచ్చిపోతున్నారని, పండగ పూట పల్నాడులో జరిగిన హత్యలకు ఆయన మాటలే కారణమన్నారు. రప్పారప్పా అంటూ రాష్ట్రంలో దాడులకు పాల్పడుతున్నారని ఆరోపించారు. పల్నాడులో ఇద్దరి మధ్య జరిగిన ఘటనను కులాలకు ఆపాదిస్తున్నారన్నారు. పల్నాడు జిల్లాలో ఇద్దరు యువకులు కత్తులతో గొడవకు దిగి ఒకరు మృతిచెందడం బాధాకరమని చెప్పారు. ఈ ఘటనపై జగన్ శవరాజకీయాలకు పాల్పడుతున్నారంటూ మండిపడ్డారు.