Share News

హెల్మెట్‌ ఎక్కడమ్మా..!

ABN , Publish Date - Jan 31 , 2026 | 05:00 AM

శ్రీసత్యసాయి జిల్లా పెనుకొండలో శుక్రవారం ఓ ఆసక్తికర ఘటన చోటుచేసుకుంది. హెల్మెట్‌ లేకుండా బైక్‌ నడుపుతున్న ఓ యువకుడిని మంత్రి సవిత ఆపి, అతని వివరాలు ఆరా తీశారు.

హెల్మెట్‌ ఎక్కడమ్మా..!

  • రోడ్డుపైనే ఓ యువకుడి తల్లికి మంత్రి సవిత ఫోన్‌

హిందూపురం, జనవరి 30(ఆంధ్రజ్యోతి): శ్రీసత్యసాయి జిల్లా పెనుకొండలో శుక్రవారం ఓ ఆసక్తికర ఘటన చోటుచేసుకుంది. హెల్మెట్‌ లేకుండా బైక్‌ నడుపుతున్న ఓ యువకుడిని మంత్రి సవిత ఆపి, అతని వివరాలు ఆరా తీశారు. తన పేరు సాయి అని, తమ ఊరు సోమందేపల్లి అని ఆ యువకుడు తెలిపాడు. అతని తల్లికి ఫోన్‌ చేయించి మాట్లాడారు. ‘అమ్మా.. నేను మినిస్టర్‌ సవితమ్మను మాట్లాడుతున్నా. మీ కుమారుడికి రూ.2.5లక్షల బండిని కొనిచ్చారు. బైక్‌ కంటే నీ కుమారుడు ముఖ్యం కదా..! హెల్మెట్‌ ఎందుకు కొనివ్వలేదు?’ అని ప్రశ్నించారు.

Updated Date - Jan 31 , 2026 | 05:00 AM