సీమలో రక్తం పారించిన చరిత్ర మీది కాదా జగన్?
ABN , Publish Date - May 24 , 2026 | 03:55 AM
‘జగన్... మీ తాత రాజారెడ్డితో మొదలుకుని, నీ వరకు రాయలసీమలో రక్తం ఏరులై పారించలేదా..? ఆ చరిత్ర మీది కాదా..?’ అని మంత్రి సవిత నిలదీశారు.
శాంతి దూత కబుర్లు చెపుతూ జనం చెవిలో పూలు పెట్టకండి: మంత్రి సవిత
హిందూపురం, మే 23(ఆంధ్రజ్యోతి): ‘జగన్... మీ తాత రాజారెడ్డితో మొదలుకుని, నీ వరకు రాయలసీమలో రక్తం ఏరులై పారించలేదా..? ఆ చరిత్ర మీది కాదా..?’ అని మంత్రి సవిత నిలదీశారు. ‘పరిటాల రవిని, వివేకాను చంపిందెవరో ప్రజలకు తెలుసు. మీ తాత, మీ నాన్న చరిత్ర, నీ చరిత్ర తెలియనివారు ఎవరూ లేరు. మదర్ థెరిస్సాలా శాంతి దూత అని చెప్పుకుంటూ ప్రజల చెవుల్లో పూలు పెట్టకండి. నీ సిద్ధాంతం విధ్వంసమైతే.. మా సిద్ధాంతం అభివృద్ధి. దేశంలోనే ఏపీని అగ్రగామిగా నిలపడానికి కూటమి ప్రభుత్వం రేయింబవళ్లు కృషి చేస్తోంది. 23 నెలల్లో రూ.25 లక్షల కోట్లు పెట్టుబడులు తీసుకొచ్చాం. మా చరిత్ర క్లీన్‌గా ఉంది. పరిశుభ్రతతో రాష్ట్రం అభివృద్ధి సాధ్యమవుతుందని నమ్మి ఈ కార్యక్రమానికి ముఖ్యమంత్రి చంద్రబాబు శ్రీకారం చుట్టారు. ఎవరికివారు పరిశుభ్రత పాటించాలి’ అని మంత్రి సవిత పేర్కొన్నారు.